పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచారు అధికారులు . 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం రహస్య గదిని ఓపెన్ చేసినట్లు సీఎంవో వెల్లడించింది. జగన్నాథుడి సేవలకు ఆటంకం కల్గకుండా భాండాగారాన్ని తెరిచారు అధికారులు. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను లెక్కించనున్నారు. నిధిని తరలించేందుకు చెక్క పెట్టేలను సిద్ధం చేశారు.
జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో ఓపెన్
శ్రీ జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు కట్టుబడి ఉన్నాం” అని పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ శంకర్ స్వైన్ వెల్లడించారు. రత్న భాండాగార్ను తెరవడంపై ఒడిశా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన16 మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ జులై 14న దీనిని తెరవాలని సిఫార్సు చేసింది. ఇక్కడి భాండాగారానికి రక్షణగా పాము ఉందని కొంత మంది భావిస్తుంటారు. ఆ వదంతులను బలభద్రుని ప్రధాన సేవకుడైన హలధర్ దశమోహపాత్ర కొట్టిపారేశారు. ముందు జాగ్రత్తగా అధీకృత సిబ్బంది, పాములు పట్టే వ్యక్తి ఆలయంలోకి ప్రవేశిస్తారు. భాండాగారాన్ని తెరిచాక ఆభరణాలను తూకం వేయకూడదని వాటిని లెక్కించి రీసీల్ వేయాలని దశమోహపాత్ర సూచించారు.
#WATCH | Puri, Odisha: Special boxes brought to Shri Jagannath Temple ahead of the re-opening of Ratna Bhandar.
— ANI (@ANI) July 14, 2024
The Ratna Bhandar of the Shri Jagannath Temple is to be opened today following Standard Operating Procedure issued by the state government. pic.twitter.com/xwRdtQe0Ml