ఒడిశా రైలు ప్రమాదం .. ఘటనా స్థలానికి ఏపీ 108 అంబులెన్స్‌లు

 ఒడిశా రైలు ప్రమాదం ..   ఘటనా స్థలానికి ఏపీ 108 అంబులెన్స్‌లు

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే రాష్ట్రంలోని ఆస్పత్రులను  అప్రమత్తం చేశారు.108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు  ఘటన స్థలానికి తరలించారు.  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారెవరూ చనిపోయినట్లు సమాచారం లేదు. 

రైల్వే శాఖ అందించిన  సమాచారం మేరకు ప్రమాదానికి గురైన కోరమండల్‌ రైలులో ఏపీకి చెందిన వారు 482 మంది ఉన్నారు. ఇందులో  309 మంది విశాఖలో దిగవలసి ఉండింది. అయితే వీరిలో 57 మంది ప్రయాణం చేయలేదు. మిగతా వారిలో 165 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.  మరో 11 మంది గాయపడ్డారు. 76 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది క్ష్తతగ్రాత్రుల సమాచారం అందించేందుకు విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర స్థాయి అత్యవసర కంట్రోల్ రూమ్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.