కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో భారీగా ఏపీ ప్రయాణికులు

కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో  భారీగా ఏపీ ప్రయాణికులు

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు భారీగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  చెన్నై నుంచి వస్తున్ కోరమండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్  నుంచి హావ్ డా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వాళ్లు ఉన్నారు. 

కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి హావ్ డా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ఏపీలోని తిరుపతి,రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, ఏలూరు,తాడేపల్లిగూడెం, సామర్ల కోట, వైజాగ్, విజయనగరం, పలాస మమీదుగా వెళ్లింది. వీటిలో ఎక్కువగా యశ్వంత్ పూర్, తిరుపతి, రేణిగుంట స్టేషన్లో ఎక్కారు.  

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమార్‌, సంత్రగచ్చి,ఖరగ్‌పూర్‌,  బాలేశ్వర్‌ స్టేషన్లలో విజయవాడలో 47 మంది,రాజమహేంద్రవరంలో 22 మంది,  ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది.   ఇదే రైలులో రాజమహేంద్రవరం స్టేషన్‌ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కి..  చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వెళ్లేలా రిజర్వేషన్లు చేసుకున్నారు.

రాజమహేంద్రవరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ హెల్ప్‌లైన్ నంబర్:  0883 2420541
రాజమహేంద్రవరంలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్:  65395
విజయవాడలో బీఎస్‌ఎన్‌ఎల్‌ హెల్ప్‌లైన్ నంబర్:  0866 2576924
విజయవాడలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ : 67055
విశాఖలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08912 746330, 08912 744619
విజయనగరంలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08922 221202, 08922 221206
శ్రీకాకుళంలో హెల్ప్‌లైన్ నంబర్లు:  08942 286213, 286245
హెల్ప్‌లైన్ నంబర్లు 044-2535 4771, 67822 62286