మహబూబ్​నగర్ : పోలింగ్​కు అంతా రెడీ​

మహబూబ్​నగర్ : పోలింగ్​కు అంతా రెడీ​
  • ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు    
  • ఉమ్మడి జిల్లాలో 32,81,593 మంది ఓటర్లు 

మహబూబ్​నగర్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా అన్ని సెంటర్లకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

32,81,593 ఓటర్లు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32,81,593 ఓటర్లు గురువారం వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొడంగల్​లో పురుష ఓటర్లు 1,14,140 మంది, మహిళా ఓటర్లు 1,16,099, ట్రాన్స్​జెండర్స్​12 మంది, సర్వీస్​ ఓటర్లు​164 మందితో కలుపుకొని 2,30,415 మంది ఓటర్లు ఉన్నారు. నారాయణపేటలో పురుషులు 1,12,697 మంది, మహిళలు 1,14,668 మంది, ట్రాన్స్​జెండర్స్​ ఇద్దరు, సర్వీస్​ ఓటర్లు 165 మందితో కలుపుకొని 2,27,532 మంది, మహబూబ్​నగర్​లో పురుషులు 1,21,397 మంది, మహిళలు 1,21,960 మంది, ట్రాన్స్​ జెండర్స్​ పది మంది, సర్వీస్​ ఓటర్లు 322 మందిని కలుపుకొని 2,43,689 మంది, జడ్చర్లలో పురుషులు 1,06,922 మంది, మహిళలు 1,05,469, ట్రాన్స్​జెండర్స్​ నలుగురు

సర్వీస్​ ఓటర్లు 260 మందితో కలుపుకొని 2,12,655 ఓటర్లున్నారు. దేవరకద్రలో పురుషులు 1,13,528, మహిళలు 1,14,556, ట్రాన్స్ జెండర్స్​ ఇద్దరు, సర్వీస్​ ఓటర్లు 197 మందిని కలుపుకొని 2,28, 281 మంది ఓటర్లు, మక్తల్​లో పురుషులు 1,17,576, మహిళలు 1,21,009, ట్రాన్స్​ జెండర్స్​ ఒకరు, సర్వీస్​ ఓటర్లు​63 మంది కలుపుకొని 2,38,649 మంది, వనపర్తిలో పురుషులు 1,32,971, మహిళలు 1,32,644, ట్రాన్స్​జెండర్స్​ ఏడుగురు, సర్వీస్​ ఓటర్లు 221 మంది కలుపుకొని 2,65,843,  గద్వాలలో పురుషులు 1,29,7673, మహిళలు 1,29,096, ట్రాన్స్​జెండర్స్​ పది  మంది, సర్వీస్​ ఓటర్లు 34 మందితో కలుపుకొని 2,53,903 మంది

 అలంపూర్​లో పురుషులు 1,16,989, మహిళలు 1,19,080, ట్రాన్స్​జెండర్స్​ 72, సర్వీస్​ ఓటర్లు 60 మందితో కలుపుకొని 2,36,136 మంది, నాగర్​కర్నూల్​లో పురుషులు 1,12,657 మంది, మహిళలు 1,11,971, ట్రాన్స్​జెండర్స్​ 03, సర్వీస్​ ఓటర్లు 233 మందితో కలుపుకొని 2,24,864 మంది, అచ్చంపేటలో పురుషులు 1,17,124, మహిళలు 1,16,439, ట్రాన్స్​జెండర్స్​ ఇద్దరు, సర్వీస్​ ఓటర్లు173 మందితో కలుపుకొని 2,33,738 మంది, కల్వకుర్తిలో పురుషులు 1,17,393 మంది

మహిళలు 1,13,250, ట్రాన్స్ జెండర్స్​ ఏడుగురు, సర్వీస్​ ఓటర్లు 134 మందితో కలుపుకొని 2,30,784 మంది, షాద్​నగర్​లో పురుషులు 1,13,872 మంది, మహిళలు 1,11,583 మంది ట్రాన్స్​జెండర్స్​ 15 మంది, సర్వీస్  ఓటర్లు​54 మందితో కలుపుకొని 2,25,524, కొల్లాపూర్​లో పురుషులు 1,16,975 మంది, మహిళలు 1,12,420 మంది, ట్రాన్స్​ జెండర్స్​ నలుగురు, సర్వీస్​ ఓటర్లు 181 మందితో కలుపుకొని 2,29,580 మంది ఓటర్లున్నారు.

14 స్థానాల్లో 200 మంది క్యాండిడేట్లు

ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 200 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా కల్వకుర్తి నుంచి 24 మంది క్యాండిడేట్లు, గద్వాల నుంచి 20 మంది బరిలో ఉన్నారు. కొడంగల్, వనపర్తి, అలంపూర్​ నుంచి 13 మంది చొప్పున, నారాయణపేట నుంచి ఏడుగురు, మహబూబ్​నగర్, జడ్చర్ల, నాగర్​కర్నూల్​ నుంచి 15 మంది చొప్పున, దేవరకద్ర నుంచి 12 మంది, మక్తల్​ నుంచి 11 మంది, అచ్చంపేట, షాద్​నగర్​, కొల్లాపూర్​ నుంచి 14 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు.