విద్యారంగంపై సీఎం రేవంత్రెడ్డిని... అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నరు: ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.కాసీం

విద్యారంగంపై సీఎం రేవంత్రెడ్డిని...  అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నరు: ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.కాసీం

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో పాలకులు మారుతున్నా విద్యారంగం పట్ల వారి దృక్పథం మారడం లేదని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం కాచిగూడలోని స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ ఆధ్వర్యంలో జరిగిన ద్వితీయ కార్యవర్గ సమావేశం, విద్యా సదస్సులో  సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. 

విద్యారంగ అభివృద్ధికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని ప్రొ. కాసీం ఆకాంక్షించారు.