మొక్కలు నాటిన తర్వాతే కళ్యాణలక్ష్మి చెక్కులు

మొక్కలు నాటిన తర్వాతే కళ్యాణలక్ష్మి చెక్కులు
  • సీఎం బర్త్​డేకు కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో మొక్కలు నాటించిన ఆఫీసర్లు

ఖానాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్​ బర్త్​డే సందర్భంగా టీఆర్ఎస్ ​నేతలు రాష్ట్రమంతా మొక్కలు నాటాలని నిర్ణయించారు. అయితే ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ప్లాంటేషన్​ ప్రోగ్రాం విమర్శలకు తావిచ్చింది. మొక్కలు నాటేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులను వాడుకోవడమే ఇందుకు కారణం. స్థానిక ఆఫీసర్లు ఎప్పుడో రిలీజ్​ అయిన చెక్కులను ఆపి అందరినీ బుధవారం ఖానాపూర్​ మార్కెట్ ​కమిటీ ఆఫీస్​కు పిలిపించారు. చెక్కులు ఇవ్వాలంటే ముందు అంతా ‘మొక్కల టార్గెట్’​ను కంప్లీట్ ​చేయాలని హుకుం జారీ చేశారు. మహిళలంతా మండుటెండలోనే మొక్కలు నాటారు. తాము చేయాల్సిన పనులను లబ్ధిదారులతో చేయించి అధికారులు నేతల దృష్టిలో పడిపోయినట్లు తెగ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రేఖానాయక్ అక్కడికి చేరుకుని చెక్కులు పంపిణీ చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ లీడర్లు ఎంపీపీ అబ్దుల్ మోహిద్, కౌన్సిలర్ షబ్బీర్ పాషా అక్కడి నుంచి వెళ్లిపోయారు.