గొర్రెలు ఇస్తామని ఏపీ తీస్కెళ్లి అక్కడే వదిలేశారు

గొర్రెలు ఇస్తామని ఏపీ తీస్కెళ్లి అక్కడే వదిలేశారు

గొర్రెల కోసం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  వెళ్లిన హుజురాబాద్  నియోజకవర్గ  గొల్లకురుమలు... తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. కర్ణాటకలోని   బీదర్, మహారాష్ట్రలోని  చంద్రాపూర్ లాంటి ప్రాంతాలకు  తిప్పిన అధికారులు... అక్కడ  గొర్రెలు లేవంటూ   ఇప్పుడు కడప జిల్లా పోరుమామిళ్ల కు  తీసుకొచ్చారని  ఆవేదన వ్యక్తం  చేశారు. కడప జిల్లా పోరుమామిళ్లలో కూడా గొర్రెలు లేవన్నారని   చెప్పారు. తెచ్చుకున్న డబ్బులు  అయిపోయి, తిండికి లేక, ప్రయాణ ఖర్చులు  లేక అవస్థలు  పడుతున్నామంటూ   వీడియోను రికార్డ్  చేసి   వీ6కు పంపించారు యాదవులు. 

ఇవాళ జమ్మికుంటలో  తలసాని శ్రీనివాస్  యాదవ్  ఆధ్వర్యంలో   రెండో విడత గొర్రెల  పంపిణీ కార్యక్రమం  ఉంది. ఈ కార్యక్రమంలో   తాము ప్రభుత్వాన్ని  ఎక్కడ   నిలదీస్తామోనని  తమను అక్కడికి  రాకుండా   ఇలా తిప్పుతున్నారని  ఆరోపించారు. ఇప్పటికే గొర్లు ఎంపిక చేసుకున్న  లబ్దిదారులతో   ఇవాళ హుజురాబాద్ లో  పంపిణీ   ప్రోగ్రామ్ పెట్టారు  మంత్రులు. ఐతే... గొర్రెల  యూనిట్   దొరకని యాదవులు  ఇంకా చాలమంది  ఉన్నట్టు తెలుస్తోంది. తాము నిరసన   తెలుపుతామనే... అధికారులు  తమను ఊళ్లు  తిప్పుతున్నారని... ఆరోపిస్తున్నారు  గొల్ల కుర్మలు. 

గొర్రెలిప్పిస్తామని .... హుజురాబాద్  నియోజక వర్గంలోని   60మంది  గొర్రెకుర్మలను ఇటీవలే గుంటూరు  తీసుకెళ్లారు  అధికారులు. గుంటూరు జిల్లా  మాచర్ల మండలానికి  తీసుకెళ్లి అక్క డే వారిని  అధికారులు విడిచిపెట్టారు.   అధికారులు ఫోన్  స్విచ్చాఫ్  చేయటంతో  ఆ 60మంది తినడానికి  కూడా   తిండి లేక   అక్కడే ఇబ్బంది  పడ్డారు. 4 రోజుల  కింద... కరీంనగర్ జిల్లా వీణవంక  మండలానికి   చెందిన వారిని  గుంటూరు తీసుకెళ్లారు  అధికారులు. గొర్రెలిప్పిస్తామని చెప్పి… అధికారులు  ఇంత దారుణంగా  ప్రవర్తిస్తారా   అని వారి  కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గొర్రెలు ఇప్పించకపోయినా  ఫర్వాలేదు కానీ..   తమ వారిని  సేఫ్ గా  ఇంటికి చేర్చాలని వారి కుటుంబ సభ్యులు  కోరుతూ  పంపిన  వీడియో ...ఇటీవలే వైరల్ అయింది.