పెద్దపల్లి జిల్లాలో పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు

పెద్దపల్లి జిల్లాలో పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు

పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం చేస్తుండడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో  ఫారెస్ట్ అధికారులు హెచ్చరికల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో  అటవీ ప్రాంతాలైన  కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి మండలాల్లోని పలు  గ్రామాల్లోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. పెద్దపులి ఆనవాళ్లు  ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయాలని కోరారు.

ప్రజలు అడవిలోకి వెళ్లొదని, పశువులు, మేకల కాపరులు అడవి లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా, ఏ విధంగానైనా పులికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే వారిని చట్టరిత్యా కఠిన శిక్ష పడుతుందని ఈ ఫ్లెక్సీ ద్వారా అధికారులు తెలియజేశారు. ఎవరికైనా పులి ఎదురైతే పులి కల్లలోకి నేరుగా చూడవద్దని, పరిగెత్తవద్దని, పెద్ద శబ్ధం చేయాలని స్పష్టం చేశారు.