
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఆర్టీసీకి చెందిన ఖాళీ జాగలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు ఈ టెండర్లు ఆహ్వానించారు. కాచిగూడ, మేడ్చల్, శామిర్‌పేట, హకీంపేట్, చెంగి చెర్ల, తుర్కయాంజాల్, రషీద్ గూడ (శంషాబాద్) ప్రాంతాల్లో మొత్తం 38.59 ఎకరాలు లీజుకు ఇవ్వనున్నట్లు టెండర్‌లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు మార్చి 15 వరకు టెండర్ దాఖలుకు తుది గడువు విధించారు. వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్ లేదా 99592 24433 నంబర్‌కు సంప్రదిం చాలని అధికారులు సూచించారు.