
కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్స్టేషన్వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాల కావలసిన స్థల సేకరణపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, మిలటరీ అథారిటీలోని స్థలాలను ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వరకు 18 కిలో మీటర్ల పొడవుతో ఎలివేటెడ్ స్కైవే పనులను స్పీడప్ అయ్యాయి. అయితే.. మూడు ప్రాంతాల్లో స్కేవేకు ఇరువైపులా ఎంట్రీ, ఎగ్జిట్ర్యాంపులు నిర్మించాలని నిర్ణయించారు.
ఇప్పటికే అధికారులు ల్యాండ్డీ మార్కేషన్పనులు చేపట్టారు. స్కైవే బ్లూ ప్రింట్ప్రకారం.. కార్ఖానా, తిరుమలగిరి,అల్వాల్ ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ కు మార్కింగ్ చేశారు. మరోవైపు ఇరువైపులా సర్వీసు రోడ్లకు స్థల సేకరణను అధికారులు చేపట్టారు. మరోవైపు ఈ ప్రాంతంలో భూములు కోల్పోతున్న వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని, లేదా స్కైవే ను రీ -డిజైన్ చేయాలని కోరుతున్నారు.
రెండున్న కిలోమీటర్లలో 300 ప్రాపర్టీలు
రక్షణమంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్థలాలతో పాటు సికింద్రాబాద్జూబ్లీ బస్స్టేషన్నుంచి తిరుమలగిరి వరకు సేకరించిన 2.5 కిలో మీటర్ల స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి. ఇందులో సుమారు 300 మంది భూ నిర్వాసితులు ఉన్నారు. వీళ్లకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో ఆరు దశాబ్దాల నుంచి ఉంటున్నామని, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని, స్కైవే నిర్మాణం వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని తిరుమలగిరి, కార్ఖానా, లాల్బజార్ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన నష్టపరిహారం అందేలా చూడాలని, లేకుంటే స్కైవేల డిజైన్మార్చాలని కోరుతున్నారు.
ప్రాపర్టీ ఓనర్లకు నష్టపరిహారం న్యాయంగా ఇవ్వాలి
స్కైవేల నిర్మాణంలో సికింద్రాబాద్ కార్ఖానా, వాసవీ నగర్ ప్రాంతంలో ఎక్కువ మంది వ్యాపారులు స్థలాలు కోల్పోతున్నారు. జేబీఎస్నుంచి తిరుమలగిరి వరకు రెండున్నర కిలో మీటర్లమేర ప్రైవేటు స్థలాలు ఉన్నాయని, వారందరికి మార్కెట్ వాల్యూ ప్రకారంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాండ్ డీ మార్కేషన్కు ముందే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
– తేలుకుంట సతీశ్గుప్తా, వాసవి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు