
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ అప్పుడే తన మార్కును చూపించడం మొదలుపెట్టారు. తన ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు షిఫ్ట్‌ల వారీగా పని వేళలు నిర్ణయించారు. తొలి షిఫ్ట్ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 4 గంటలకు వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు ఉండనుంది. మంత్రి వైష్ణవ్ ఆఫీసులో పని చేసే వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని.. మిగతా రైల్వే స్టాఫ్, ప్రైవేటు ఉద్యోగులకు వర్తించవని రైవ్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అర్ధరాత్రి వరకు పని చేస్తాడని పేరున్న వైష్ణవ్‌కు.. రైల్వేస్‌తోపాటు కమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలను కూడా మోడీ సర్కార్ అప్పగించింది. ప్రధాని మోడీ విజన్‌లో రైల్వేలు చాలా ముఖ్యమని, ఆయన ఆశయాలను నిజం చేసేందుకు తాను కృషి చేస్తానని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో వైష్ణవ్ పేర్కొన్నారు.