ఎంసెట్,నీట్ కోచింగ్ ఇంకెన్ని సార్లు వాయిదాలు.?

ఎంసెట్,నీట్ కోచింగ్ ఇంకెన్ని సార్లు వాయిదాలు.?

హైదరాబాద్, వెలుగు:  మార్చి 13న ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. మరో 25 రోజుల్లో ఎంసెట్​ ఉంది. అయినా, అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఎందులో  అంటారా..? ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థు లకు ప్రభుత్వం ఎంసెట్​, నీట్​, జేఈఈకి ఆన్ లైన్ శిక్షణ ఇస్తోంది కదా. ఈ ఏడాది మాత్రం ఇంటర్ పరీక్షలు అయిపోయి మూడు వారాలు అవుతున్నా ..ఇంత వరకు శిక్షణ అన్న ఊసే లేదు మరి. గత నెల 26నే ప్రారంభిస్తామన్నా ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. రెసిడెన్షియల్ (హాస్టల్ ) సౌకర్యం లేకపోవడం, విద్యార్థులకు సమాచారం ఇవ్వకపోవడంతో శిక్షణ అటూ ఇటూ కాకుండా పోతోంది. ఎంసెట్​  దగ్గరపడుతుండడంతో ఇప్పటికే మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ప్రైవేట్​ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు.

డేట్లు మారినయ్  రాష్ట్రంలోని 404 ప్రభుత్వ కాలేజీల్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకున్న వెయ్యి మంది విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయిం చారు. అందులో భాగంగా మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల వివరాలను నేరుగా ఇంటర్ బోర్డు నుంచే తీసుకున్నారు. కాలేజీల నుంచి కాకుండా ఇలా నేరుగా వివరాలను తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల మాట ఎలా ఉన్నా, అన్ని జిల్లాల నుంచి (ఉమ్మడి పది జిల్లాల ఆధారంగా) 500 మంది ఎంపీసీ, 500 మంది బైపీసీ విద్యార్థులను ఎంపిక చేసి ఆ వివరాలను కాలేజీలకు పంపిం చారు. గత నెల 26నే కోచింగ్ ప్రారంభిస్తామన్నా రు. కానీ, ఆ తర్వాత డేట్లు మార్చారు. ఏప్రిల్ 1కి వాయిదా  వేశారు. ఏమైందో ఏమోగానీ ఆ డేట్​ కూడా మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 4కు మారింది. ఈ డేటూ ఇప్పుడు పోయింది. ఈ నెల 8 నుంచి క్లాసులు మొదలవుతాయని ఇంటర్ కమిషనరేట్​ అధికారి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు. గత ఏడాది వరకూ మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సారి మాత్రం వసతి లేకుండానే ఒక్కో ఉమ్మడి జిల్లాలో రెండు చొప్పున సెంటరను్ల ఏర్పాటు చేస్తున్నా రు. అయితే, జిల్లా కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే మారుమూల ప్రాంతా ల విద్యార్థులకు వచ్చిపోవడం కష్టంగా మారింది. బస్ పాస్ కూడా లేకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలంటూ గవర్నమెంట్ లెక్చరర్స్ యూనియన్ నేతలను నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. అందుకు వారు ఒప్పుకుని రెమ్యు నరేషన్ లేకుండానే శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మాత్రం వారితో బోర్డు కమిషనర్ కనీసం మాట్లాడలేదనితెలుస్తోంది. తమతో ఎవరూ మాట్లాడలేదని, గత ఏడాదిలాగే ఇప్పుడూ అడిగితే ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లమని ప్రభుత్వ లెక్చరర్స్ యూనియన నేత మధుసూదన్ రెడ్డి చెప్పారు.