మియాపూర్, వెలుగు : మియాపూర్లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అతిథి, అంగారా, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్ కిచెన్లలో బొద్దింకలు తిరుగుతుండడాన్ని గుర్తించారు. అంతే గాకుండా సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతు న్నారని తేల్చారు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, ఎఫ్ఎస్ఎ స్ఏఐ లైసెన్స్ కాపీ ప్రదర్శించక పోవడంతో నోటీసులు అందజేశారు. తుప్పు పట్టిన రిఫ్రిజిరేటర్లలో కవరింగ్ లేకుండా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.