హైదరాబాద్‌‌‌‌లో ఆఫ్‌‌‌‌షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ బైండ్జ్ ఆఫీస్

హైదరాబాద్‌‌‌‌లో ఆఫ్‌‌‌‌షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ బైండ్జ్ ఆఫీస్

హైదరాబాద్, వెలుగు: ఆఫ్‌‌‌‌షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ బైండ్జ్,  భారత్‌‌లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్​లో శుక్రవారం తమ రెండో డెలివరీ సెంటర్‌‌‌‌ను ప్రారంభించింది. ఆఫ్‌‌‌‌షోర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైయన్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి దీనిని ఏర్పాటుచేసింది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్యలో ఉన్న  ఈ ఆఫీసు క్లయింట్‌‌‌‌లకు అధిక- నాణ్యత, అత్యాధునిక టెక్నాలజీలతో ఫైనాన్షియల్ సొల్యూషన్లను అందిస్తుంది.

పన్ను, సలహా, వాల్యుయేషన్, క్లయింట్ అకౌంటింగ్ , కంప్లయన్స్, టెక్నాలజీ సేవలను అందిస్తామని ఈ సందర్భంగా బైండ్జ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శిరీష్ కొరడా చెప్పారు.  ఈ విస్తరణతో కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని రెండు ప్రధాన డెలివరీ హబ్‌‌‌‌లలో సేవలు అందిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని క్లయింట్‌‌‌‌ల నుంచి పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.