సిగరెట్లు తాగితే.. నాలుక ఈ రంగులోకి మారిపోతుందా?

సిగరెట్లు తాగితే.. నాలుక ఈ రంగులోకి మారిపోతుందా?

ధూమపానం వల్ల  ఎన్ని దుష్పలితాలో మనకు తెలుసు.. ధూమపానం చేయడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్​తో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే యూఎస్​లో  సిగరెట్ తాగటం అలవాటున్న  ఓ వృద్దుడికి విచిత్రమైన అనుభవం  ఎదురైంది. ​సిగిరెట్​ తాగిన వెంటనే అతని నాలుకపై వెంట్రుకలు పెరగడంతోపాటు రంగు మారింది. ఈ విషయాన్ని ది న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​ పేర్కొంది. ఇది సోషల్​ మీడియోలో వైరల్​ అవుతోంది. 
ది న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ప్రకారం.. 60 యేళ్ల వ్యక్తి  సిగరెట్​ తాగుతున్న సమయంలో యాంటీ బయోటిక్స్​ తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో అతని శరీరంలో అనూహ్య మార్పులు చేసుకున్నాయి.  

వైద్య పరీక్షలు నిర్వమించిన డాక్టర్లు... ఆ వ్యక్తి నాలుకపై వెంట్రుకలు పెరిగినట్లు నిర్ధారించారు.  అతని నాలుక ఉపరితలంపై చర్మ కణాలు అసాధారణ పూతతో కప్పి  ఉన్నాయన్నారు. ఈ స్థితిని ఫిలిఫాం పాపిల్లేగా డాక్టర్లు చెప్పారు. నాలుకపై రుచి మొగ్గల్లాగా పొడుచుకు వచ్చి బ్యాక్టీరియా ఏర్పడి, చెత్తా చెదారం చేరడంతో రంగు మారిన స్థితిని  ఫిలిఫాం పాపిల్లే అని పిలుస్తారు. అతని నాలుకపై వెంట్రుకలు, ఆకుపచ్చ నాలుకను  గమనించిన తర్వాత వైద్య నిపుణులు సిగరెట్లను తాగితే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

కాగా.. ఇలాంటి వింత కేసులు గతంలోనూ నమోదయ్యాయి. 2022లో భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి స్ట్రోక్ తర్వాత నాలుకపై నల్లటి వెంట్రుకలతో బాధపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. మే లో జపాన్కు చెందిన 60 యేళ్ల మహిళ.. మల క్యాన్సర్​ కు చికిత్స పొందుతున్నప్పుడు ఆమె.. ఇలాంటి స్థితినే  ఎదుర్కొంది. దీనిని మినోసైక్లిన్​గా గుర్తించారు.