ఆయిల్​పామ్​ సాగు టార్గెట్​ 20 లక్షల ఎకరాలు 

ఆయిల్​పామ్​ సాగు టార్గెట్​ 20 లక్షల ఎకరాలు 

అశ్వారావుపేట, వెలుగు: పామాయిల్ పంటకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయిల్​ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్​ఫెడ్ నర్సరీలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మొక్కల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్​ సాగు చేయాలని నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్​సాగు ప్రోత్సాహానికి రూ.11,040 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల హెక్టార్లకు ఆయిల్ పామ్​ప్లాంట్స్ డిమాండ్ ఉందని, అందులో పది వేల హెక్టార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉందన్నారు. డిమాండ్ కు తగ్గ మొక్కలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు.