
కోహెడ, వెలుగు : ఆయిల్‌పామ్ ఖమ్మం తర్వాత సిద్దిపేట జిల్లాలోనే ఎక్కువ సాగవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సిద్దిపేట మండలంలోని బస్వాపూర్‌లో గురువారం మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... 12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు.
నర్మెటలో ఆగస్ట్ 15లోగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రయారిటీ ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా హుస్నాబాద్‌కు ఆయిల్‌పామ్ తీసుకురావచ్చొన్నారు. ఆలియ్ పామ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.