
-
అన్నవరం నుంచి హాష్ ఆయిల్ స్మగ్లింగ్
-
2.3 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం..నలుగురు అరెస్ట్..
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అన్నవరం నుంచి సిటీలోని మీర్‌పేటకు గంజాయి, హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2.3 కేజీల హాష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.
మీర్‌పేటకు చెందిన వటుల రంజిత్‌కుమార్ అలియాస్ నిఖిల్ అలియాస్లడ్డూ డ్రైవర్. ఇతను ఈజీ మనీ కోసం గంజాయి, హాష్ స్మగ్లింగ్ప్లాన్చేశాడు. తన స్నేహితులు బొల్లం సాయి నితిన్, బచ్చు నరేంద్ర, బోయిన్‌పల్లి సాయికృష్ణ, వినీత్‌తో కలిసి విశాఖ ఏజెన్సీలో హాష్ ఆయిల్ కొని సిటీకి తరలిస్తున్నారు.
ఫిబ్రవరి 2024లో సరూర్‌గర్ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. సెప్టెంబర్ 16న బయటకి వచ్చారు. వినీత్ మినహా మిగిలిన నలుగురు ఇటీవల అన్నవరం వెళ్లారు. 2.7 కేజీల హాష్ ఆయిల్ కొనుగోలు చేసి సిటీకి తీసుకొచ్చారు. నితిన్ ఇంట్లో దాచిపెట్టారు. సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి టీమ్, మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుతో కలిసి నితిన్ ఇంట్లో సోదాలు చేసింది. 2.3కిలోల హాష్ఆయిల్స్వాధీనం చేసుకుంది. నలుగురిని అరెస్ట్ చేసింది. అలాగే ఆదిభట్లలో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన సంతోష్‌కుమార్, బిరేందర్ సింగ్‌ను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 19 గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు.