
ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు
తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి కన్ను మూశారు. మృతుల్లో ఇద్దరు అంధులు ఉన్నట్లు సమాచారం. వీరు కాకినాడ శరదాదేవి టెంపుల్ భానుగుడికి చెందిన వారుగా గుర్తించారు. చనిపోయిన మూడో వ్యక్తి ఆటోడ్రైవర్ ఆరెళ్ల వెంకటేష్( 17) గా అనుమానిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.