శంకుస్థాపనకు ఓకే..పనులు చేయొద్దు

శంకుస్థాపనకు ఓకే..పనులు చేయొద్దు

పార్లమెంట్‌‌‌‌ కొత్త బిల్డింగ్‌‌‌‌ నిర్మాణంపై సుప్రీం
పిటిషన్లు విచారణ తర్వాతే నిర్ణయం

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ నిర్మాణ (సెంట్రల్‌‌‌‌ విస్తా ప్రాజెక్ట్‌‌‌‌) పనులకు శంకుస్థాపన చేసేందుకు తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. కానీ, నిర్మాణ పనులు మాత్రం ఇప్పుడే మొదలుపెట్టొద్దని, పేపర్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌ మాత్రం చేసుకోండని  సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సెంట్రల్‌‌‌‌ విస్తా ప్రాజెక్ట్‌‌‌‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని జస్టిస్‌‌‌‌ ఎ.ఎం. ఖాన్‌‌‌‌విల్కర్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌ స్పష్టం చేసింది. సెంట్రల్‌‌‌‌ విస్తా ప్రాజెక్ట్‌‌‌‌ వల్ల ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌‌‌‌ భవనం దెబ్బతింటుందని, వందలాది చెట్లు నేలకొరుగుతాయని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా.. పార్లమెంట్‌‌‌‌ కొత్త బిల్డింగ్‌‌‌‌కి ఈ నెల 10న మోడీ శంకుస్థాపన చేయనుండటంతో విచారణ చేపట్టిన సుప్రీం ఈ కామెంట్స్‌‌‌‌ చేసింది. అంత హడావిడిగా ప్రాజెక్టుపై ముందుకెళ్లడం ఎందుకని ప్రశ్నించింది.