రూ.499 కే ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. లాంచ్ డేట్ ఫిక్స్!

రూ.499 కే ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. లాంచ్ డేట్ ఫిక్స్!

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. దీనిని ముందుగా అందిపుచ్చుకునేందుకు దూసుకొచ్చిన అతి కొద్ది కంపెనీల్లో ఓలా ఒక‌టి. ఈ కంపెనీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించి.. బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. లాచింగ్‌కు ముందే అరుదైన రికార్డును కూడా సృష్టించింది. కేవ‌లం 499 రూపాయ‌ల‌కే ఈస్కూట‌ర్ బుక్ చేసుకోవ‌చ్చ‌ని గ‌త నెల‌ల ప్ర‌క‌టించి, బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజే 24 గంట‌ల్లో ల‌క్ష మందికి పైగా ఈ మొత్తం క‌ట్టి స్కూట‌ర్ బుక్ చేసుకున్నారు. ఈస్కూట‌ర్ల లాంచింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కస్ట‌మ‌ర్ల ఉత్కంఠ‌కు తెర‌దించుతూ మంగ‌ళ‌వారం ఓలా సీఈవో భవిష్ అగ‌ర్వాల్ ప్ర‌క‌ట‌న చేశారు. స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న ఓలా ఈస్కూట‌ర్స్ లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు ట్వీట్ చేశారు.

ఓలా స్కూటీ మ‌రిన్ని విశేషాలు

  • ఓలా తీసుకురాబోయే స్కూట‌ర్లు ఎస్, ఎస్1, ఎస్1 ప్రో మోడ‌ళ్ల‌లో రాబోతున్నాయి. ఈ స్కూట‌ర్లు త‌మిళ‌నాడులోని ఓలా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ త‌యారీ యూనిట్‌లో రెడీ అవుతున్నాయి.
  • న‌లుపు, ఎరుపు, నీలం, ప‌సుపు, తెలుపు, సిల్వ‌ర్, పింక్ స‌హా మొత్తం ప‌ది రంగుల్లో ఈ స్కూట‌ర్లు రానున్నాయి.
  • రిమోవ‌బుల్ లిథియం అయాన్ బ్యాట‌రీల‌తో ఈ స్కూటీలు వ‌స్తాయి.
  • ఒక‌సారి ఫుల్ చార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ట్రావెల్ చేయొచ్చ‌ని తెలుస్తోంది. పూర్తి స్పెసిఫికేష‌న్స్ ఆగ‌స్టు 15న తెలుస్తాయి.
  • దేశంలోని 400 సిటీల్లో సుమారు ల‌క్ష చార్జింగ్ పాయింట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఓలా కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఏడాది చివ‌రి లోపు 100 సిటీల్లో క‌నీసం 5 వేల చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఓలా టార్గెట్ పెట్టుకుంది.