Ola S1 Rang: ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఓలా..రూ.25వేల ఆఫర్ పొడిగించింది

Ola S1 Rang:  ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఓలా..రూ.25వేల ఆఫర్ పొడిగించింది

Ola Electric  సంస్థ తమ స్కూటర్లపై ఇటీవల ప్రకటించిన డిస్కౌంట్లను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ తమ స్కూటర్ లైనప్ పై 25వేల  వరకు ధరలు డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ విషయాన్ని ఓలా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది. 

డిస్కౌంట్లలో Ola S1 ప్రో ధర రూ. 17,500తగ్గింపు, Ola S1 ఎయిర్ పై రూ. 15వేలు, Ola S1X+ ధరలో రూ. 28వేల తగ్గింపును ఇచ్చింది. డిస్కౌంట్లతో Ola S1 లైనప్ ఎక్స్ షోరూమ్ ధరలు మార్చి నెలలో ఎలా ఉన్నాయో చూద్దాం. 

  • Ola S1 ప్రో  ధర రూ. 1,19,999( ఎక్స్ షోరూమ్ )
  • Ola ఎయిర్ ధర రూ. 1,04,999( ఎక్స్ షోరూమ్ )
  • Ola X (4kwh) ధర రూ. 1,09,999( ఎక్స్ షోరూమ్ )
  • Ola X +(3kwh) ధర రూ. 84,999( ఎక్స్ షోరూమ్ )
  • Ola X (3kwh) ధర రూ. 89,999( ఎక్స్ షోరూమ్ )
  • Ola X (2kwh) ధర రూ. 79,999( ఎక్స్ షోరూమ్ )

ఓలా తన ఉత్పత్తుల అమ్మకాల్లో దూసుకుపోతుంది.  2024 ఫిబ్రవరి నెలలో 35 వేల  యూనిట్లను విక్రయించి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చూసింది. దీంతో Ola  ఇప్పుడు డిసెంబర్ 2023 నుంచి లక్ష కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకుంది.