లీజ్​ పేరుతో ఓలా మోసం : క్యాబ్​ డ్రైవర్ల అర్ధనగ్న ప్రదర్శన

లీజ్​ పేరుతో ఓలా మోసం : క్యాబ్​ డ్రైవర్ల అర్ధనగ్న ప్రదర్శన

కూకట్​పల్లి, వెలుగు: లీజు పేరిట ఓలా సంస్థ క్యాబ్ డ్రైవర్లను మోసం చేస్తోందని, డ్రై రన్ పేరుతో అన్యాయం చేస్తోందని ఓలా డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఓలా యాజమాన్యం తీరును నిరసిస్తూ కూకట్‌పల్లి ఆఫీసు ఎదుట చేతులకు చెప్పులు వేసుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం డ్రైవర్లు  మాట్లాడుతూ తమకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఓలా యాజమాన్యం ఉన్న ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు. డ్రై రన్ పేరిట సరైన చార్జీలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ– క్యాబ్ సర్వీసుల కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చి డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. 4 నెలలుగా సంస్థ డ్రైవర్లంతా నష్టాల్లో ఉన్నారని ఫోర్​ వీలర్స్​ అసోసియేషన్​ప్రెసిడెంట్​షేక్​సలావుద్దీన్​ఆవేదన వ్యక్త చేశారు. డ్రైవర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓలా యాజమాన్యం మానవతా ధృక్ఫథంతో వ్యవహరించాలని కోరారు.