
బెంగళూరు: క్యాబ్ సర్వీసులు అందించే ఓలా.. కిరాణా సామాన్ల డెలివరీనీ మొదలుపెట్టింది. బెంగళూరులో కిరాణా, పర్సనల్ కేర్, పెట్ ప్రొడక్టుల ను క్విక్ డెలివరీ చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఇందుకోసం 'ఓలా స్టోర్'ను బెంగళూరులో కొన్ని కీలక ప్రాంతాల్లో తెరిచింది. రాబోయే నెలల్లో ఇతర సిటీలకూ విస్తరిస్తామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం పావు గంటలో డెలివరీ ఇస్తామని పేర్కొంది. ఓలా యాప్ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. అయితే కొంతమంది కస్టమర్లకే ఈ ఆప్షన్ కనిపిస్తోందని సమాచారం. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్ నుంచి ఆర్డర్ చేయవచ్చు.