
కస్టమర్లకు షాకిచ్చేందుకు ట్యాక్సీ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఛార్జీలు భారీగా పెంచుకునేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో ధరలు భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 ప్రకారం ఛార్జీలను పెంచుకునేందుకు రవాణా శాఖ అనుతించింది.
పీక్ హవర్స్ లో ఇప్పటి వరకు బేస్ ప్రైస్ పైన 1.5 శాతం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. దీనిపై రెండింతలు పెంచుకునేందుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా సాధారణ సమయంలో యాభై శాతం మించకుండా ఛార్జీలు పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది.
అదే విధంగా ఎలాంటి కారణం లేకుండా డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేస్తే 10 శాతం ఫైన్ విధించవచ్చునని.. అది కూడా 100 రూపాయలకు మించకుండా ఫైన్ వేయవచ్చునని గైడ్ లైన్స్ లో తెలిపింది. ఇవే రేట్లు రైడ్ క్యాన్సిల్ చేసిన కస్టమర్లకు కూడా వర్తిస్తాయని పేర్కొంది.
అన్ని రాష్ట్రాలు ఈ గైడ్ లైన్స్ ను మూడు నెలల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రవాణా శాఖ సూచించింది. నాన్ ట్రాన్ స్పోర్ట్ మోటార్ సైకిల్స్ ను కూడా పర్మిట్ చేయవచ్చునని, అందుకోసం రాష్ట్రాలు రోజువారీగా లేదా వారం, 15 రోజుల లెక్కన ఫీజు వసూలు చేయవచ్చునని తెలిపింది.
ఈ నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాలలో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధం తొలగిపోనుంది. కేంద్ర నిర్ణయాన్ని ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు స్వాగతించారు. ‘వికసిత్ బారత్ లో ఈ నిర్ణయం ఒక మైల్ స్టోన్ గా ఆపరేటర్లు అభివర్ణించారు.