హైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి

హైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి

హైదరాబాద్:  నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంగటన చోటుచేసుకుంది.  అదిత్యనగర్ లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పడి గులాం మహమ్మద్ అనే వృద్ధుడు మృతి చెందాడు. 

భారీగా గుంతలు తవ్వి రక్షణ లేకుండా వదిలేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. కాంట్రాక్టర్, జలమండలి అధికారులపై  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మృతుడి కుటుంబ సభ్యుల కాంట్రాక్టర్, జలమండలి అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ పై 304-2 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.