
గండిపేట్, వెలుగు: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు కత్తితో పొడిని కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌కు చెందిన సైఫ్ అహ్మద్ ఖాన్(23) ఓ కంపెనీలో ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ సఫియుద్దీన్, మహమ్మద్ జబి పాత కక్షల కారణంగా బుధవారం రాత్రి 8.30 గంటలకు అతనిపై కత్తితో దాడి చేశారు. సైఫ్ మెడ, చాతిపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితుల వద్ద నుంచి కత్తి, బైక్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్‌చేసినట్లు సీఐ పేర్కొన్నారు.