Sanju vs Surya: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్య నవ్వుతూ సమాధానం ఇచ్చిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్ట్, “సంజూ స్యామ్సన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలనే ఆలోచన ఉందా?” అని క్వశ్చన్ చేశాడు.. దానికి సూర్యకుమార్ వ్యంగ్యంగా స్పందిస్తూ, అంటే అభిషేక్ స్థానంలో ఆడించాలా? లేక తిలక్ స్థానంలోనా? అని తిరిగి ప్రశ్నించాడు. ఆ సమయంలో అతడు చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం నెట్టింట ఇప్పుడు చర్చకు దారితీసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ పలు మార్పులు చేసింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు సంజూ శాంసన్ ని మళ్లీ తుది జట్టులోకి తీసుకుంది. అలాగే వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంజూ (97 పరుగులు నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శాంసన్ ఆడిన ఇన్సింగ్స్ వల్లే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
సంజు శాంసన్ ప్రదర్శన తర్వాత పాత వీడియోను నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఒక యూజర్ “ఇదే సూర్యకు సంజు ఇచ్చిన సరైన సమాధానం” అంటూ వ్యాఖ్యానించగా, మరో యూజర్ “సంజును అభిషేక్ స్థానంలో పెట్టాలా అని ఎగతాళి చేసిన సూర్య ఈ వీడియో చూడు అంటూ ట్రోలింగ్ చేశాడు.
Not many opportunities this #WorldCup, but when it mattered, Sanju stood tall and played the innings of his life 👏🏻 That’s the mindset of a champion! Stay ready, stay patient and never stop believing! Proud of you @IamSanjuSamson! The spirit of never giving up always wins!…
— Yuvraj Singh (@YUVSTRONG12) March 1, 2026
"Achha hi toh chal raha hai..." 😅
— Star Sports (@StarSportsIndia) February 21, 2026
A new opening pair for #INDvSA? @surya_14kumar reacts in his typical style 😎
ICC Men’s #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/LB4lVF78fE
