
ఎల్బీనగర్,వెలుగు: సిటీలో గురువారం రాత్రి కురిసిన వానకు కోదండ రాంనగర్ కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు.హెల్త్ ఎమర్జెన్సీ లో కూడా అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సరూర్ నగర్ కోదండరాం నగర్ కాలనీలో శారదాదేవి (70) కి గుండె పోటుతో రావడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వానకు వరదనీరు రోడ్డుపై పారుతుండగా అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొనగా సకాలంలో ట్రీట్మెంట్ అందక ఆమె మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను కూడా వరద నీళ్లలోనే ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఇంటి ముందు వరద నీరు పారుతుండగానే శుక్రవారం అంత్యక్రియలు చేశారు. కనీసం బల్దియా అధికారులు, సిబ్బంది స్పందించలేదు.