దొంగను వెంబడించి పట్టుకున్న మహిళ

దొంగను వెంబడించి పట్టుకున్న మహిళ

దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తిని ఓ మహిళ వెంటాడి పట్టుకుంది. పైసలు కొట్టేసి పారిపోతున్న కేటుగాన్ని  చితకబాది పోలీసులకు అప్పజెప్పింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఈ ఘటన జరిగింది. ఏదులాబాద్ కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలిని ఉంది. సంఘంలో రోజువారీ జమయ్యే మొత్తాన్ని జమ చేసేందుకు అప్పుడప్పుడు బ్యాంకుకు వస్తుంటుంది. శుక్రవారం సైతం రూ.50వేలు తీసుకుని ఘట్కేసర్ లోని యూనియన్ బ్యాంక్ కు వచ్చింది. ఆమె చేతిలో పైసలున్న విషయం గమనించిన ఓ యువకుడు నగదు సంచి కొట్టేసి పారిపోయాడు. దీంతో నర్సమ్మ గట్టిగా కేకలు వేస్తూ పారిపోతున్న దొంగ వెంటపడింది. కాసేపటికి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగను వెంబడించి పట్టుకున్న నర్సమ్మను అందరూ మెచ్చుకుంటున్నారు.