కోనరావుపేట, వెలుగు: ఉడకని అన్నం.. నీళ్ల చారుతో తమ పిల్లలు మిడ్ డే మీల్స్ తినలేకపోతున్నారని పేరెంట్స్ ఎంఈవోను నిలదీశారు. కోనరావుపేట మండలం సుద్దాల హైస్కూల్‌లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి ఎంఈవో మురళినాయక్ హాజరయ్యారు.
అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన తయారీ సరిగా లేదని నిలదీశారు. ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
