ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం.. నెట్టింట్లో కాబోయే భార్యతో మొదటి ఫోటోలు వైరల్..

ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం.. నెట్టింట్లో కాబోయే భార్యతో మొదటి ఫోటోలు వైరల్..

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన చిన్నప్పటి స్నేహితురాలు అవివా బేగ్ తో  నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని రైహాన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

రైహాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఫోటోలో ఈ జంట  నిశ్చితార్థ వేడుకలో ఎంతో సంతోషంగా కనిపించగా.. రెండవ ఫోటో వారి చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ పోస్ట్‌కు "29.12.25" అనే డేట్ క్యాప్షన్‌గా పెట్టారు. అంటే డిసెంబర్ 29న వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రైహాన్ వాద్రా గురించి: 
గాంధీ కుటుంబానికి చెందిన మూడో తరం వారసుడైన రైహాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ & విజువల్ ఆర్టిస్ట్.

►ALSO READ | మరో యుద్ధం మొదలైంది: వెనిజులా రాజధాని కారకాస్పై అమెరికా బాంబు దాడులు

పదేళ్ల వయస్సు నుంచే కెమెరా పట్టుకొని  ఫోటోగ్రఫీ మొదలుపెట్టిన రైహాన్.. వన్యప్రాణులు, స్ట్రీట్ ఫోటోగ్రఫీలో మంచి అనుభవం సంపాదించారు. 2021లో 'డార్క్ పర్సెప్షన్' పేరుతో మొదటి ఫోటోగ్రఫీ షోని ఢిల్లీలో నిర్వహించారు. అదే సంవత్సరం అతను కోల్‌కతాలో జరిగిన ది ఇండియా స్టోరీ షోలో కూడా పాల్గొన్నాడు.

అవివా బేగ్ ఎవరు?
రైహాన్ కాబోయే భార్య అవివా బేగ్ కూడా మంచి టాలెంట్ ఉన్న మహిళా. ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్.  ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదువుకున్న ఆమె, జిందాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసింది.  అవివా గతంలో జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా.

ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్త. వీరి కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరికీ ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉండటంతో, వీరిద్దరి ఇష్టాలు కూడా బాగా కలిశాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.