ఏ ముహూర్తాన 2026 జనవరి ఒకటో తేదీ మొదలైందో ఏమో.. ప్రపంచ వ్యాప్తంగా రోజుకో జరగుతుంది. నిన్నా మొన్నటి వరకు అమెరికా, వెనిజులా మధ్య మాటల వరకే పరిమితం అయిన యుద్ధం.. ఇప్పుడు బాంబు దాడుల వరకు వచ్చేసింది.
వెనిజులా రాజధాని కారకాస్ సిటీని టార్గెట్ చేసింది అమెరికా. 2026, జనవరి 3వ తేదీ తెల్లవారుజామున అమెరికా యుద్ధ విమానాలు కారకాస్ పై బాంబుల వర్షం కురిపించాయి. అర్థరాత్రి తర్వాత అమెరికా యుద్ధ విమానాలు వెలిజులా రాజధాని కారకాస్ పై చక్కర్లు కొడుతూ.. బాంబులు వేశాయి. కారకాస్ సిటీలో ఉన్న పోర్టులు లక్ష్యంగా.. ఈ బాంబు దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత కాలమానం ప్రకారం జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. కారకాస్ సిటీలో విమానాలు తిరగటం, బాంబు పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ దాడులపై అమెరికా, వెలిజులా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Caracas en estos momentos! La cosa no es juego, ojalá amanezcamos con una hermosa noticia pic.twitter.com/DB0JHWwTbp
— Francisco Giannoccaro (@GiannoFG) January 3, 2026
కొన్నాళ్లుగా అమెరికా, వెనిజులా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికాలోకి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వెనిజులా నుంచి వస్తున్నాయని.. వీటిని వెంటనే అరికట్టాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి సంబంధించి ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ప్రకటించారు.
ALSO READ : నిరసనకారులను చంపితే మేమొస్తం..
అమెరికా ఒప్పందం వెనక మరో కారణం ఉందని.. అది ఆయిల్ అని.. చమురు ఒప్పందానికి పట్టుబడుతుందని.. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా డ్రగ్స్ అక్రమ రవాణా పేరుతో దేశంపై ఒత్తిడి చేస్తుందంటూ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ బహిరంగంగా ప్రకటన చేయటంతో.. అమెరికా మండిపడుతోంది. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ అర్థరాత్రి వెనిజులా రాజధాని కారకాస్ పై అమెరికా ఎయిర్ స్ట్రయిక్స్ చేయటంతో.. మరో యుద్ధం వచ్చిందంటున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి.
🇻🇪 MULTIPLE EXPLOSIONS REPORTED IN CARACAS, VENEZUELA
— Crown Intelligence Group (@crownintelgroup) January 3, 2026
Residents across Caracas reported loud explosions, low-flying aircraft, and siren-like alarms in the early hours of January 3rd at 2:00 AM local time. Videos circulating on social media show flashes and smoke columns at… pic.twitter.com/32uUkcdKLC
