సంక్రాంతి ముందే చల్లబడ్డ బంగారం, వెండి.. కొత్త ఏడాదిలో తొలిసారి తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే!

సంక్రాంతి ముందే చల్లబడ్డ బంగారం, వెండి.. కొత్త ఏడాదిలో తొలిసారి తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే!

బంగారం, వెండి ధర ఈ రోజు చల్లబడింది. కొత్త ఏడాది మొదటి రోజు నుండే పరుగులు పెట్టిన రేట్లకు 3 జనవరి 2026న బ్రేకులు పడ్డట్లు అయ్యింది. దింతో బంగారంతో పాటు వెండి ధర దిగొచ్చింది. అయితే ఇప్పటికే ఆకాశాన్ని తాకిన ధరలు సామాన్యులు కొనేందుకు కునుకు లేకుండా చేస్తుంది.  ఒక విధంగా చూస్తే బంగారం ధర గత ఏడాదితో పోల్చిది డబుల్ కాగా... వెండి ధర రెండింతలు అయ్యింది. ఇక సంక్రాంతి తరువాత రానున్న పెళ్లిళ్ల సీజనలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే బంగారం, వెండి ధర ఇంతలా పెరగడానికి కారణం ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు, సప్లయ్ అండ్ డిమాండ్,  డాలరుతో పోల్చితే రూపాయి విలువ  సహా చాల అంశాలపై ఆధారపడి ఉంటుంది.   

ఈరోజు (3 జనవరి 2026) 1 గ్రాము ధర
24K బంగారం 1 గ్రాము ధర  రూ.38   తగ్గి రూ.13వేల582,  22K బంగారం గ్రాము ధర రూ.35 తగ్గి రూ.12వేల450, 18K బంగారం గ్రాము ధర రూ.28 పడిపోయి రూ.10 వేల187  

10 గ్రాముల ధర 
24క్యారెట్ల ధర రూ.380 తగ్గి రూ.1 లక్ష 35 వేల 820  

22 క్యారెట్ల ధర రూ.350 తగ్గి  రూ.1లక్ష24 వేల 500  

18 క్యారెట్ల ధర రూ.280 తగ్గి   రూ.1లక్ష 01వేల 870  

ఈరోజు వెండి ధర చూస్తే  గ్రాముకు రూ.4 తగ్గి రూ.256 , కిలోకి రూ.4 వేలు పడిపోయి రూ.2లక్షల56వేలు. 

ALSO READ : అదానీ కొత్త సంస్థ.. ఏఈ5ఎల్..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24క్యారెట్ల ధర రూ.1 లక్ష 35 వేల 820, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష24 వేల 500, 18 క్యారెట్ల ధర  రూ.1లక్ష 01వేల 870. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24క్యారెట్ల ధర రూ.1 లక్ష 35 వేల 820, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష24 వేల 500, 18 క్యారెట్ల ధర  రూ.1లక్ష 01వేల 870.