కొచ్చి షిప్‌యార్డ్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. కనీస డిగ్రీ అర్హతతో జాబ్..

కొచ్చి షిప్‌యార్డ్ లో టెక్నికల్ అసిస్టెంట్  పోస్టులు.. కనీస డిగ్రీ అర్హతతో జాబ్..

కొచ్చిన్ షిప్‌యార్డ్ (CSL) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.  

పోస్టులు: 3( జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ (పీజీడీసీఏ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్​లో బీఎస్సీ లేదా కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: జనవరి 20. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఆన్​లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు cochinshipyard.in వెబ్​సైట్​ను సందర్శించండి.