గోదావరిఖని, వెలుగు : సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని రామగుండం ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025–-26లో 9 నెలల కాలంలో ఆర్జీ 1 ఏరియాలో నిర్దేశించిన 33.02 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గానూ 29.62 లక్షల టన్నులతో 90 శాతం టార్గెట్ సాధించినట్లు తెలిపారు.
సీఎస్ఆర్ కింద సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి వెంబడి కోటి 59 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో రూ.7 కోట్లతో ఆర్‌వో ప్లాంట్లు, రోడ్లు, ఓపెన్‌జిమ్, సోలార్ లైట్లు, బయో టాయిలెట్లు.. కార్యక్రమాలు చేపట్టినట్టు జీఎం తెలిపారు. రామగుండం ఏరియాలో ‘నీటి బిందువు -జలసింధువు’లో భాగంగా కొత్తగా ఆరు చెరువులను నిర్మించినట్లు చెప్పారు.
మీటింగ్‌లో ఎస్‌వోటూ జీఎం కె.చంద్రశేఖర్, వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఎ.ఆంజనేయులు, డాక్టర్బి.అంబిక, వరప్రసాద్, బి.కర్ణనాయక్, గీతేందర్సింగ్, ధనలక్ష్మి, టి.రమేశ్, ఎం.వీరారెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి, వేణు, శ్రావణ్‌కుమార్, హన్మంతరావు, బ్రహ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.
