Sandeep Reddy Vanga: వంగా స్టైల్ ప్రమోషన్‌తో సోషల్ మీడియా షేక్.. యాక్టర్ చైతన్య రావు బోల్డ్ పోస్టర్‌పై హాట్ డిస్కషన్!!

Sandeep Reddy Vanga: వంగా స్టైల్ ప్రమోషన్‌తో సోషల్ మీడియా షేక్.. యాక్టర్ చైతన్య రావు బోల్డ్ పోస్టర్‌పై హాట్ డిస్కషన్!!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడినా, పోస్ట్ పెట్టిన అది సోషల్ మీడియా సెన్సేషనే. ఇటీవలే ‘స్పిరిట్’ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి డార్లింగ్ ఫ్యాన్స్‌కు భారీ బూస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన స్నేహితుడి సినిమాను ప్రమోట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు.

అయితే, ఆ పోస్టర్‌లో హీరో బట్టలు లేకుండా (పూర్తి నగ్నంగా) కనిపించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ముఖ్యంగా ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నది తెలుగు యంగ్ యాక్టర్ చైతన్య రావు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇంతకుముందెన్నడూ చూడని డేరింగ్ ప్రెజెంటేషన్, వంగా స్టైల్ ప్రమోషన్ కారణంగా ఈ పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్ హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఒకవైపు షాక్ అవుతుంటే, మరోవైపు సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

►ALSO READ | Thalaivar 173 Director: రజనీ - కమల్ కాంబోపై బిగ్ అప్డేట్.. ‘తలైవర్ 173’ డైరెక్టర్ కుర్చీలో కూర్చునేది ఇతనే

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా చిత్రబృందానికి బెస్ట్ విషెష్ అందించారు. "నా ప్రియ మిత్రుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న 5వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా, లోతైన భావాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఆల్ ది బెస్ట్.. చిత్రబృందానికి బెస్ట్ విషెస్" అని వంగా తెలిపారు. ఈ సినిమాకు 'దిల్ దియా' (DIL DIYA) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు డైరెక్టర్ క్రాంతి మాధవ్. ఇందులో చైతన్య రావుకి జోడీగా ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో  డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

చైతన్య రావు సినిమాలు:

షార్ట్‌‌‌‌ ఫిల్మ్స్ నుంచి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటుడిగా బిజీగా ఉన్నాడు చైతన్య రావు. 30 వెడ్స్‌ 21 వెబ్‌ సిరీస్‌ తో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత లీడ్ రోల్స్‌‌‌‌తోపాటు కీలక పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన "మాయసభ"లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషించి మరింత దగ్గరయ్యారు. ఇటీవలే అనుష్క లీడ్‌‌‌‌గా క్రిష్ రూపొందించిన ‘ఘాటి’ చిత్రంలో విలన్ పాత్ర పోషించి కొత్త నటుణ్ని పరిచయం చేసుకున్నాడు. అంతకు ముందు అన్నపూర్ణ ఫొటో స్టూడియో, కీడా కోలా, పారిజాత పర్వం,‘షరతులు వర్తిస్తాయి’ వంటి సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ భావాలున్న సినిమా చేస్తూ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు చైతన్య రావు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chai Shots (@chaishotsapp)