జమ్మికుంట, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీవో శ్రీధర్ హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2024-–25 ఆర్థిక సంవత్సరానికి గానూ 20 గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన చెల్లింపులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. గండ్రపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.1.93 లక్షల విలువైన పనులు జరిగినట్లు గుర్తించారు.
అనంతరం డీఆర్డీవో మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని 20 జీపీల్లో ఐదువేల మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేశారని, వారికి దాదాపు రూ.3.50కోట్లు చెల్లించినట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి రూ.80 లక్షలతో స్కూళ్లలో టాయిలెట్స్, కిచెన్ రూమ్స్, రోడ్లు వేసినట్లు చెప్పారు.
ఉపాధి హామీ పనులను నియమ నిబంధనల ప్రకారం చేయాలని కొలతల్లో తేడా వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, కన్వర్షన్ ఆఫ్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మీనారాయణ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు హరికృష్ణ, ప్లాంటేషన్ మేనేజర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
