మల్కాజిగిరి, వెలుగు: నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్.కె.పురం ఫ్లైఓవర్ ను రీడిజైన్చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయే ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి, ఇండ్లు, దుకాణాలకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వల్లబ్ నగర్ బేగంపేట్ నుంచి అల్వాల్ కు మార్చాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
