కామేపల్లి, వెలుగు : మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా, మండల నాయకులు గింజల నరసింహారెడ్డి, పత్తే హమ్మద్ శివయ్య, కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు రాంబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం మండలం లో మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఐఏన్టీయూసీ అనుబంధంగా ఏర్పడి కామేపల్లి లోని మెయిన్ ట్యాంకు వద్ద సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా గోకినేపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా చల్లా లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా బానోత్ రవి, సహాయ కార్యదర్శిగా గుడిమెట్ల శేఖర్ కోశాధికారిగా కనికరపు వినయ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు చిల్లా కోటేశ్వరరావు, బత్తుల మల్లయ్య, నేరెళ్ల వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి సంపత్ కుమార్, దేవేండ్ల కొండ, ఎర్రబోయిన కృష్ణయ్య, బొరిగొర్ల వెంకటేశ్వర్లు, వాంకుడోత్ శ్రీకాంత్, దొంగల పవన్ కుమార్, పుట్ట వెంకటేశ్, కనికరపు సంపత్, సీహెచ్ రమేశ్, పొదిలి నగేశ్ కుమార్ పాల్గొన్నారు.
