ట్రంప్.. టెంపర్ ఏ రేంజ్ లో ఉంది అంటే.. ఓ దేశ ప్రధానమంత్రిని.. నలుగురి నిల్చోపెట్టి క్లాస్ పీకాడు.. నిలబడు.. నువ్వు లేచి నిలబడు అంటూ ఆర్డర్ ఇవ్వటమే కాదు.. నీ గురించి నాకు చాలా తక్కువ తెలుసు.. అసలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అంటూ చీపురు పుల్ల తీసిపారేసినట్లు.. మీడియా సమావేశంలోనే.. అందరి ముందు పాకిస్తాన్ ప్రధాని పరువు తీసిపారేశాడు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఘోర పరాభవం ఎదురైంది. వాషింగ్టన్ లో నిర్వహించిన బోర్డు ఆఫ్ పీస్ మీటింగ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాక్ ప్రధానిని ఘోరంగా అవమానించారు. సమావేశంలో అందరూ చూస్తుండగానే షెహబాజ్ లేచి నిలబడు అని ఆర్డర్ వేశారు.
షరీఫ్ నాకు కొంచెం తెలుసు.. మోదీ బాగా తెలుసు.. వ్యాపారం ద్వారానే నేను పాకిస్తాన్ గురించి తెలుసుకున్నాను. వారు నాతో చాలా ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి విషయంలో నేను జాలిగా ఉంటాను. అని ట్రంప్ పాక్ పై కొంచెం బాధను వ్యక్తం చేశారు. మోదీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనల్ని గమనిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ పెద్ద విషయం..మీరు నిజంగా లేచి నిలబడాలి ’’ అని ట్రంప్ ఓ మాస్టర్ లాగా షెహబాజ్ ఓ స్టూడెంట్ లాగా ఆర్డర్ వేశారు.
ఇదిలా ఉంటే పాక్ ప్రధాని షరీఫ్ షెహబాజ్ ఎందుకు నిలబడమన్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.బోర్డు ఆఫ్ పీస్ మీటింగ్ లో గతేడాది భారత్ , పాక్ యుద్దానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఇది జరిగింది. షెహబాజ్ లేచి నిలబడు అని ఆర్డర్ వేసి భారత్ ప్రధాని మోదీ ని ప్రశంసిస్తూ పరోక్షంగా పాక్ ప్రధాని షెహబాజ్ ను అవమానించారు.
ఇంత జరిగినా షరీఫ్ మాత్రం ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అవమానం జరిగినప్పటికీ వెన్న రుద్దే కార్యక్రమంపై ఎక్కువ శ్రద్ద పెట్టారు షరీఫ్. ట్రంప్ శాంతి మనిషి అని దక్షిణాసియా రక్షకుడు అంటూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు షరీఫ్.
