పొలంలో దిగి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్లు

పొలంలో దిగి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్లు

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే కలెక్టర్లు పొలంబాట పట్టారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. బురదలో దిగారు. గోవిందరావుపేట మండలం రంగాపురంలో కూలీలతో కలిసి వరినాటు వేశారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కలెక్టర్ నారాయణరెడ్డి.. అక్కడ రైతులు నాట్లు వేయడాన్ని చూసి హోదా మరిచిపోయి తాను కూడా నాటు వేశారు. రైతు బిడ్డనేనని డిగ్రీ వరకు చదువుతూ వ్యవసాయ పనులు చేశానని రైతులకు చెప్పారు. తమతో పాటు కలెక్టర్ నాటు వేయడంతో రైతులు సంబురపడ్డారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతిహోలికేరి కూడా నాట్లు వేశారు. జైపూర్ మండలంలోని గంగిపెల్లి గ్రామంలో సాగు చేస్తున్న పంటపొలాలను పరిశీలించారు. ట్రాక్టర్ పైకెక్కి దుక్కి దున్నడాన్ని స్వయంగా పరిశీలించారు. పక్కనే వరినాట్లు వేస్తున్న రైతులను చూసి…. పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. భర్త శంకర్, కూతురు ఆధ్యలతో కలిసి నాట్లు వేసిన కలెక్టరమ్మ.. రైతులు, కూలీలతో కాసేపు సరదాగా గడిపి సాగు పద్దతులను అడిగి  తెలుసుకున్నారు.