
న్యూఢిల్లీ: ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ షూటర్ విజయ్ కుమార్.. ఆన్‌లైన్‌లో న్యాయవాద వృత్తికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా పని చేస్తున్న ఈ షూటర్.. ట్రెయినింగ్‌లో భాగంగా ఈ పని చేస్తున్నాడు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌లో ఖాళీ సమయాన్ని ఈ విధంగా ఉపయోగించు కుంటున్నాడు. ఫిజికల్ ట్రెయినింగ్ కూడా తీసుకోవాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌తో దానిని పోస్ట్‌పోన్ చేశారు. ‘నా ఫిజికల్ ట్రెయినింగ్‌ను ఆపేశా. కానీ ఆన్‌లైన్‌లో లా క్లాసెస్ మాత్రం వింటున్నా. సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా ఫిజికల్ ట్రెయినింగ్ సాధ్యం కాదు. ప్రస్తుతానికి ఔట్‌సైడ్ వరల్డ్‌తో కనెక్షన్ పెద్దగా లేదు’ అని 34 ఏళ్ల విజయ్ పేర్కొన్నాడు.