ఆది పురుష్ .. కొత్త విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్ ఓం రౌత్

ఆది పురుష్ .. కొత్త విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్ ఓం రౌత్

భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ చిత్రం ఆది పురుష్ కొత్త విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ మూవీ జూన్ 16, 2023న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మామూలుగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉండగా.. తాజాగా విడుదల తేదీలో మార్పు చేస్తూ కొత్త డేట్ ను ప్రకటించింది. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. 

ఆది పురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల టీజర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేవని, కార్టూన్స్‌లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు దర్శక, నిర్మాతలపై పలువురు మండిపడ్డారు.  నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌పై మరొకసారి పనిచేయనున్నట్టు సమాచారం. ఈ గ్రాఫిక్స్ కు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చవ్వబోతున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల కూడా వాయిదా పడిందని సమాచారం. ఇదిలా ఉండగా రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.