బాలుడు చేసిన అల్లరి పనికి.. రూ.946 కోట్ల నష్టం

బాలుడు చేసిన అల్లరి పనికి.. రూ.946 కోట్ల నష్టం

ఓ బాలుడు చేసిన అల్లరి పని.. రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అన్ని కోట్ల నష్టం రావడానికి అతగాడు ఏం చేశాడో తెలుసా? మొదట టేబుల్ పై ఉన్న సోయా సాస్ బాటిల్ మూత తెరిచి దానిని నాకినబాలుడు, దాన్ని మళ్లీ అక్కడే పెట్టేశాడు. పోనీ అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు. పక్కనున్న టీ కప్పులను చేతికి అందుకొని వాటిని నాలుకతో తాకుతూ లాలాజలం అంటించాడు. ఆపై నోటిలో తన వేలు పెట్టుకుని దానిని తీసి అక్కడున్న ఆహార పదార్థాలపై ఆ వేలును ఉంచాడు. బాలుడు రహస్యంగా చేసిన ఈ పనులన్నిటినీ మరో వ్యక్తి వీడియో తీశాడు. 

అంతే నిమిషాల వ్యవధిలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో రెస్టారెంట్ లో అమ్మకాలన్నీ పడిపోయాయి. జపాన్‌లోని సుషీ రెస్టారెంట్‌కు చెందిన ఓ ఫ్రాంచైజ్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. సదరు బాలుడిపై రెస్టారెంట్ బ్రాంచ్ రూ.3.95 కోట్ల దావా వేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు చేసిన పనికి కంపెనీకి దాదాపు రూ.946 కోట్ల నష్టం వచ్చినట్లు సుషీ సంస్థ తన దావాలో పేర్కొంది. అయితే ఈ ఘటన పట్ల బాలుడు తన తప్పును ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టివేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. తాను, తన ఫ్రెండ్ కలిసి ప్రాంక్ వీడియో తీశామని బాలుడు కోర్టుకు వెల్లడించాడు.

https://twitter.com/bakusai_com/status/1619667296951353344