ఒమిక్రాన్ ఎఫెక్ట్: జపాన్‌‌‌‌ బార్డర్ల మూసివేత

ఒమిక్రాన్ ఎఫెక్ట్: జపాన్‌‌‌‌ బార్డర్ల మూసివేత

టోక్యో: ఒమిక్రాన్‌‌‌‌ వ్యాప్తి నేపథ్యంలో జపాన్​ బార్డర్లను మూసేసింది. ఫారెనర్లను తమ దేశంలోకి అనుమతించబోమని సోమవారం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్​ కేసులు నమోదు కాకపోయినా.. గత అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ఫ్యూమియో కిషిడ తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, అన్ని రకాల కరోనా రూల్స్‌‌‌‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు.