ఒమిక్రాన్ ప్రమాదకరమే.. కానీ లాక్ డౌన్ అవసరం లేదు

V6 Velugu Posted on Nov 30, 2021

క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ గురించి ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ కేసులు ఉన్న ఇతర దేశాల నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించాయి. అయితే, ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికాలో ఓ వ్య‌క్తిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధార‌ణ అయింది. అయితే, ఆ వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అమెరికాలో లాక్‌డౌన్ అవ‌స‌రం లేద‌న్నారు బైడెన్. ప్ర‌జ‌లు అంద‌రూ క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తే లాక్‌డౌన్ అవ‌స‌రం ఉండ‌బోద‌ని వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు.  ఎనిమిది ఆఫ్రికా దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై అమెరికా ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించింది.

Tagged Omicron lockdown, not needed, Biden 

Latest Videos

Subscribe Now

More News