స్టూడెంట్లకు లీడర్ షిప్ క్వాలిటీ ఉండాలి : డిజిటల్ ఈక్విటీ సంస్థ సీఈవో ఓంకార్ నాథ్

స్టూడెంట్లకు లీడర్ షిప్ క్వాలిటీ ఉండాలి : డిజిటల్ ఈక్విటీ సంస్థ సీఈవో  ఓంకార్ నాథ్

స్టూడెంట్లకు లీడర్ షిప్ క్వాలిటీ ఉండాలి

డిజిటల్ ఈక్విటీ సంస్థ సీఈవో ఓంకార్ నాథ్

కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

ముషీరాబాద్, వెలుగు : స్టూడెంట్లకు లీడర్ షిప్ క్వాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని డిజిటల్ ఈక్విటీ సంస్థ సీఈవో, ఫౌండర్ ఓంకార్ నాథ్ తెలిపారు. మంగళవారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న 297 మంది స్టూడెంట్లకు కాలేజీ ట్రైనింగ్ వెల్​నెస్ సెంటర్ ఆధ్వర్యంలో రిక్రూట్​మెంట్ డ్రైవ్ ఫర్ ఇంటర్ షిప్ ప్రోగ్రామ్ నిర్వహించారు.

ఓంకార్ నాథ్​తో పాటు ఈక్విటీ సంస్థ ప్రతినిధులు కిర్మణయి, చంద్రకాంత్ చీఫ్ గెస్టులుగా హాజరై స్టూడెంట్లకు వివిధ అంశాలపై గ్రూప్ డిస్కషన్ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రిక్రూట్ మెంట్ తర్వాత స్టూడెంట్ల నాలెడ్జ్​కు తగినట్లుగా ఉద్యోగ బాధ్యతలు ఉంటాయన్నారు. ఇందుకోసం వారికి 10 రోజుల ట్రైనింగ్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.