విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 1న చలో హైదరాబాద్ కు ఏబీవీపీ పిలుపు

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 1న చలో హైదరాబాద్ కు ఏబీవీపీ పిలుపు

తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కేసీఆర్ సర్కార్ పాలనకు వ్యతిరేకంగా ఆగష్టు ఒకటో తేదీన ఏబీవీపీ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ విద్యార్థి కదన భేరి పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరవుతారని ఏబీవీపీ నాయకులు తెలియజేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థలను నిషేధించాలని కోరారు. ఫీజుల నియంత్రణ చట్టం చేసి, అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5 వేల 300 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.