
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందంటే.. కచ్చితంగా దాంట్లో వాట్సాప్ ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, లొకేషన్ ఏదైనా నిమిషాల్లో పంపొచ్చు. అలాంటి వాట్సాప్ ఇప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో వస్తోంది. ఒక ఫోన్ నెంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ వాడేలా మార్పులు చేస్తోంది. ఒక వాట్సాప్ అకౌంట్‌ను నాలుగు వేర్వేరు డివైజ్‌లలో వాడే విధంగా ‘మల్టీ డివైజ్ సపోర్ట్’ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి టెస్టింగ్ జరుగుతోంది. అయితే, ఎన్ని ఫోన్లలో వాడే విధంగా దాన్ని తీసుకొస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒక వాట్సాప్ నెంబర్‌ని ఒకేసారి వేర్వేరు మొబైల్స్‌లో వాడొచ్చు.